‘ఈగల్‌’తో మాకు పోటీ లేదు: నిర్మాత ఎస్‌కేఎన్‌ | Sakshi
Sakshi News home page

‘ఈగల్‌’తో మాకు పోటీ లేదు: నిర్మాత ఎస్‌కేఎన్‌

Published Tue, Feb 6 2024 6:01 PM

Producer SKN Talk About True Lover Movie - Sakshi

‘ట్రూ లవర్‌’అనేది చిన్న సినిమా. చిన్న రిలీజ్‌. ఈగిల్‌తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా కూడా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. డైరెక్టర్‌ మారుతితో కలిసి తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఎస్‌కేఎన్‌. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.  ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌కేఎన్‌ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. 

ఒక ఫ్రెండ్ ద్వారా "ట్రూ లవర్" సినిమా మా దృష్టికి వచ్చింది. ఆయన మారుతిని కలిసి సినిమా చూడమని అన్నాడు. మారుతి నాకు చెప్పి నువ్వూ రా ఇద్దరం మూవీ చూద్దాం అన్నాడు. మా ఇద్దరికీ మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది.లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. తను ఎంచుకున్న కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశాడు.

ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా.

 నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది.

బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. 

► ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ సూపర్ న్యాచురల్ మూవీ చేయాలి. సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తా.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement