Yashoda: సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్‌ తీస్తాం: హరి, హరీష్‌

Producer Sivalenka Krishna Prasad Speech at Yashoda Movie Success Meet - Sakshi

‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్‌ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌. సమంత టైటిల్‌ రోల్‌లో హరి, హరీష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్‌ విమన్‌ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్‌ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్‌ నుంచి రావాలి.  మా మూవీ ఫస్ట్‌ డే ఆరున్నర కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది.. అమెరికాలో హాఫ్‌ మిలియన్‌ మార్క్‌ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

హరి, హరీష్‌ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్‌ పార్ట్, థర్డ్‌ పార్ట్‌కు లీడ్‌ కూడా ఉంది. అయితే సీక్వెల్‌ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ  సక్సెస్‌ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్‌ చేసిన యూఎఫ్‌ఓ లక్ష్మణ్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ హేమాంబర్‌ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top