Producer Natti Kumar Serious Comments On Ram Gopal Varma, Details Inside - Sakshi
Sakshi News home page

Producer Natti Kumar: ఆర్జీవీ సినిమాలేవి రిలీజ్‌ కాకుండా చూస్తా

May 28 2022 4:27 PM | Updated on May 28 2022 7:01 PM

Producer Natti Kumar Fires On Ram Gopal Varma - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌ అయ్యారు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించాడు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా తాజాగా నట్టి కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.

(చదవండి: నా సంతకం ఫోర్జరీ చేశారు.. పోలీసులకు రామ్‌గోపాల్‌ వర్మ ఫిర్యాదు)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు తిరిగి ఇ‍వ్వమని అడిగితే.. ఫోర్జరీ చేశారంటూ తన పిల్లలపై ఆర్జీవీ తప్పుడు కేసులు పెట్టాడని ఆరోపించాడు. డబ్బులు బాగానే తీసుకున్నాడని.. ఇవ్వమని అడిగితే ఫేక్‌ అంటున్నాడని మండిపడ్డారు. తనతో పాటు చాలా మందిని ఆర్జీవీ మోసం చేశాడని ఆరోపించారు. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఒకటయ్యామని, ఇక ఆర్జీవీ పని అయిపోయిందని హెచ్చరించాడు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామన్నారు. వర్మ పేరు మీద సినిమా వస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టే తీసుకుంటానమి చెప్పారు. నిర్మాతలెవరు ఆయనతో సినిమా చేయొద్దని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement