గర్భవతిగా ప్రియమణి.. త్వరలోనే అధికారిక ప్రకటన!

PriyamaniI To Play A Pregnant Woman In Kannada Remake Film - Sakshi

ప్రియమణి ప్రస్తుతం ఫుల్‌ బిజీగా మారింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌తో అలరించిన ఆమె ఓ కన్నడ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించనుంది. గతేడాది కన్నడలో 'యాక్ట్ 1978' అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో యజ్ఞ శెట్టి ప్రధానపాత్ర పోషించింది. మన్సో రే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారట. నిర్మాత ఠాగూర్ మధు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రీమేక్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రియమణి కథానాయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో ప్రియమణి గర్భవతి పాత్రలో కనిపించనుంది. ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం,ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ మహిళ పాత్రలో ప్రియమణి నటించనుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసులో ఎవరిని బయటకు వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై ఇంట్రెస్టింగ్‌గా స్టోరీ తెరకెక్కనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ ప్రకటన రానుంది. ఇప్పటికే ప్రియమణి తెలుగులో విరాటపర్వం, నారప్ప అనే చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. కరోనా కారణంగా ఈ చిత్రాలు వాయిదా పడ్డాయి. 

చదవండి : ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది : ప్రియమణి
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top