-
గర్భవతిగా ప్రియమణి.. త్వరలోనే అధికారిక ప్రకటన!
ప్రియమణి ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌తో అలరించిన ఆమె ఓ కన్నడ చిత్రంలో లీడ్ రోల్ పోషించనుంది. గతేడాది కన్నడలో 'యాక్ట్ 1978' అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో యజ్ఞ శెట్టి ప్రధానపాత్ర పోషించింది. మన్సో రే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. నిర్మాత ఠాగూర్ మధు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రియమణి కథానాయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రియమణి గర్భవతి పాత్రలో కనిపించనుంది. ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం,ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ మహిళ పాత్రలో ప్రియమణి నటించనుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసులో ఎవరిని బయటకు వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై ఇంట్రెస్టింగ్గా స్టోరీ తెరకెక్కనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ఇప్పటికే ప్రియమణి తెలుగులో విరాటపర్వం, నారప్ప అనే చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. కరోనా కారణంగా ఈ చిత్రాలు వాయిదా పడ్డాయి. చదవండి : ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది : ప్రియమణి మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! -
కన్నడ రీమేక్‌లో నితిన్ హిట్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా!
తేజా డైరెక్షన్లో నితిన్ హీరోగా పరిచమైన చిత్రం ‘జయం’. 2002లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్తో పాటు మిగతా నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక గోపిచంద్ విలన్‌గా ఏ రేంజ్ నటించాడో అందరికి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన కథానాయికగా సదా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ అదే పేరుతో తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. ఇందులో హీరోగా రవి నటించగా.. అక్కడ కూడా సదానే హీరోయిన్గా నటించింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్ హిట్ అయ్యింది. దీంతో హీరో రవి పేరు కాస్తా ‘జయం’ రవిగా మారిపోయింది. ఈ సినిమా వచ్చి నేటికి 18 ఏళ్లు. కాగా.. ఇన్నేళ్ల తర్వాత ‘జయం’ కన్నడలో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రీమేక్‌కు ‘కేజీఎఫ్’ హీరో, కన్నడ రాక్‌స్టార్ యశ్‌ను హీరోగా పరిచయం చేసిన శశాంక్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. కర్ణాటకకు చెందిన ప్రవీణ్ అనే డాక్టర్ ఈ సినిమాతో హీరో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్ ఆ తర్వాత ఈ రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈమూవీ కన్నడ ప్రేక్షకులను ఎంతటి స్థాయిలో ఆకట్టుకంటుందో వేచి చూడాల్సిందే. -
కన్నడంలోకి ఎవరు
గత ఏడాది మంచి విజయం సాధించిన సినిమాల్లో అడవి శేష్ నటించిన ‘ఎవరు’ ఒకటి. వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్ చిత్రం ‘ది ఇన్ విజిబుల్ గెస్ట్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ‘ఎవరు’లోని ట్విస్ట్ లు తెలుగు ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేశాయి. ఆ థ్రిల్ ను కన్నడ ఆడియన్స్ కూడా ఆస్వాదించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రం కన్నడంలో రీమేక్ కానుంది. దిగంత్ అనే కన్నడ నటుడు ఈ రీమేక్ లో హీరోగా కనిపిస్తారట. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. -
కన్నడంలోకి ఖైదీ
తెలుగు–తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ నటించనున్నారు. తాజాగా ‘ఖైదీ’ కన్నడంలో రీమేక్ కాబోతున్నట్టు తెలిసింది. కార్తీ చేసిన ఖైదీ పాత్రలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తారట. నంద కిశోర్ దర్శకుడు. -
కన్నడంలో విశ్వాసం
తమిళంలో పొంగల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విశ్వాసం’. అజిత్, నయనతార నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా కన్నడంలో రీమేక్ కానుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. తమిళంలో ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థే ఈ రీమేక్‌నూ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘విశ్వాసం’ రీమేక్ సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. విశేషమేంటంటే ‘విశ్వాసం’ సినిమా ‘జగ మల్లా’ టైటిల్‌తో కన్నడంలో అనువాదం అయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement