నలుగురు యువకుల కథ | Bhagyanagaram the Telugu remake of Kannada movie rajadhani | Sakshi
Sakshi News home page

నలుగురు యువకుల కథ

Aug 13 2018 12:35 AM | Updated on Aug 13 2018 12:35 AM

Bhagyanagaram the Telugu remake of Kannada movie rajadhani - Sakshi

యష్, షీనా

మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్‌’ ఫేమ్‌ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్‌ కుమార్‌ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్‌ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్‌ రావు.

Advertisement
 
Advertisement
Advertisement