కన్నడంలో కుమారి | Kumari 21F's Kannada remake launched | Sakshi
Sakshi News home page

కన్నడంలో కుమారి

Jan 7 2018 1:59 AM | Updated on Jan 7 2018 1:59 AM

Kumari 21F's Kannada remake launched - Sakshi

‘‘నా పేరు కుమారి, నా ఏజ్‌ 21, ఐయామ్‌ ఎ ఫీమేల్‌. ఏం.. నన్ను లవ్‌ చేయటానికి నేను సరిపోనా. నా బ్యాక్‌గ్రౌండ్‌ మొత్తం కావాలా...’’ అంటూ ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాలో హెబ్బా పటేల్‌ పలికిన సంభాషణలను ఎవరూ మర్చిపోలేరు. రాజ్‌ తరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణంలో సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21ఎఫ్‌’ మంచి సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా కన్నడంలో అదే టైటిల్‌తో రీమేక్‌ అయింది. హెబ్బా పటేల్‌ పోషించిన కుమారి పాత్రను నిధి కుశలప్ప పోషించారు. కుమారి బాయ్‌ ఫ్రెండ్‌ రాజ్‌ తరుణ్‌ పాత్రలో ప్రణామ్‌ దేవరాజ్‌ నటించారు. అవినాష్, మనోజ్, అక్షయ్, రితేష్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను సంపత్‌ కుమార్, శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించగా శ్రీమన్‌ వేముల దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement