మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా.. తెలుగు రిలీజ్‌కి రెడీ | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల కలెక్షన్స్.. తెలుగులో శివరాత్రికి రిలీజ్

Published Mon, Feb 26 2024 3:36 PM

Premalu Movie Telugu Release Date Details - Sakshi

మరో మలయాళ హిట్ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ప్రేమలు'.. కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్‪‌కి రెడీ అయింది.

(ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?)

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ.. 'ప్రేమలు' సినిమా తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారట. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్స్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు.

'ప్రేమలు' సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్‌కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement