ఓటీటీలో ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పటినుంచే! | Prema Vimanam Movie To Stream On This OTT Platform | Sakshi
Sakshi News home page

Prema Vimanam: ఓటీటీలో అనసూయ ప్రేమ విమానం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Sep 16 2023 4:53 PM | Updated on Sep 16 2023 5:04 PM

Prema Vimanam Movie To Stream On This OTT Platform - Sakshi

సంగీత్‌ శోభన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శాన్వీ మేఘన హీరోయిన్‌గా నటించింది. అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిశోర్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. బాల నటులు దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్‌ కటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా నిర్మించాడు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజా

ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా బోలెడన్ని చిత్రాలు చూసేయగలుగుతున్నాం. అందుకే సినీలవర్స్‌ ఓటీటీలకు ఇట్టే కనెక్ట్‌ అయ్యారు. ఎన్ని ఓటీటీలు వచ్చినా ఆదరిస్తూనే ఉన్నారు. అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సైతం ప్రేక్షకులు మెచ్చేలా, వారికి నచ్చేలా కంటెంట్‌ ఇస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా థ్రిల్లర్‌ చిత్రాలే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో వస్తున్నాయి.

తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఓటీటీ రాకకు సిద్ధమైంది. అదే 'ప్రేమ విమానం'. సంగీత్‌ శోభన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శాన్వీ మేఘన హీరోయిన్‌గా నటించింది. అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిశోర్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. బాల నటులు దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్‌ కటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా నిర్మించాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది.

కథేంటంటే..
విమానం ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట.., ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలే ప్రేమ విమానం. ఈ ప్రేమ విమానంలో విహరించాలంటే వచ్చే నెల 13 వరకు ఆగాల్సిందే!

చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్‌ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో..

Advertisement
 
Advertisement
Advertisement