సలార్‌లో అఖిల్‌ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ సతీమణి | Sakshi
Sakshi News home page

సలార్‌లో అఖిల్‌ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ సతీమణి

Published Sun, Jan 21 2024 7:58 AM

Prashanth Neel Wife Likitha Comments On Akhil In Salaar Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'సలార్‌' బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వానికి.. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ల యాక్షన్‌ సీన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. సలార్‌ పార్ట్‌-2  ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్‌ శౌర్యాంగపర్వం' అనే టైటిల్‌ కూడా రివిల్‌ అయిపోయింది. 

సలార్‌ సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని  అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్‌ లుక్‌తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్‌ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్‌ భారీ యాక్షన్‌ సీన్స్‌లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్‌ పార్ట్‌ 2లో అఖిల్‌ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్‌ అయ్యాయి.

దీనిపై ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు.  సలార్‌లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్‌ చంపాడనే విషయం దేవాకు తెలుసా..?  అని  చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్‌ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

'సలార్‌' గ్లింప్స్‌లో చూపించిన జురాసిక్‌ పార్క్‌ డైలాగ్‌ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్‌ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్‌ రోల్‌ కూడా సలార్‌లో కొంత మాత్రమే రివీల్‌ చేసినట్లు ఆమె చెప్పారు.

Advertisement
Advertisement