Prachanda Tharunam Katinya Kavyam Movie Opening - Sakshi
Sakshi News home page

'ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ మూవీ షూటింగ్‌ షురూ

Apr 15 2023 7:43 AM | Updated on Apr 15 2023 12:22 PM

Prachanda Tharunam Katinya Kavyam Movie Opening - Sakshi

అశోక్‌ రాజ్, రితికా రాజ్, శ్రష్టి వర్మ, వినయ్‌ బిడ్డప్ప, ఉగ్రం మంజు, రవితేజ ప్రధాన పాత్రల్లో  ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ అనే సినిమా షురూ అయింది. బాల పులిబోయిన దర్శకత్వంలో పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి ప్రొడక్షన్‌ హెడ్‌ రాజ్యలక్ష్మి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, కన్నడ హీరో సిద్ధార్థ్‌ మహేశ్‌ క్లాప్‌ కొట్టారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘మన పురాణాలు, ఇతిహాసాలను సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో బ్యాలెన్స్‌ చేసి తయారు చేసిన స్క్రిప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement