ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌ ఇచ్చిన‌ ప్ర‌భాస్ | Prabhs Gift Range Rover Car To His Gym Trainer | Sakshi
Sakshi News home page

జిమ్ ట్రైన‌ర్‌కు ప్ర‌భాస్ గిఫ్ట్‌

Sep 5 2020 3:40 PM | Updated on Sep 5 2020 6:22 PM

Prabhs Gift Range Rover Car To His Gym Trainer - Sakshi

సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఒక్క‌టే ఉంటే స‌రిపోదు. అందుకు అందం, అభిన‌యం ఉండాల్సిందే. హీరోల విష‌యానికొస్తే ఫిట్‌నెస్ త‌ప్ప‌నిస‌రి. అందుకే ఇప్పుడు ఏ హీరో చూసినా షూటింగ్స్‌లో క‌న్నా ఎక్కువ‌గా జిమ్ముల్లోనే గడిపేస్తున్నారు. చెమ‌టలు చిందిస్తూ శ‌రీర సౌష్ఠ‌వాన్ని కాపాడుకునేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఇందుకోసం వారికి స్పెష‌ల్ ట్రైన‌ర్లు కూడా ఉంటారు. అంద‌రిలాగే బాహుబ‌లి హీరో కు కూడా ఓ జిమ్ ట్రైన‌ర్ ఉన్నాడు. ప్ర‌భాస్ అత‌డితో ఆప్యాయంగా మాట్లాడేవారు. (చ‌ద‌వండి: ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?)

త‌న‌కోసం క‌ష్ట‌ప‌డుతున్న అత‌నికి ఓ బ‌హుమ‌తిని కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ గిఫ్ట్ విష‌యం అంద‌రి నోరెళ్ల‌బెట్టేలా చేసింది. ఎందుకంటే జిమ్ ట్రైన‌ర్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఆషామాషీది కాదు. ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే రేంజ్ రోవ‌ర్ కారు కొనిచ్చారు. త‌న చుట్టూ ఉన్న‌వారికి ప్ర‌భాస్ ఇలా గిఫ్ట్ ఇవ్వ‌డం ఇదేం తొలిసారేం కాదు. గ‌తంలోనూ డార్లింగ్ ప‌లువురికి బ‌హుమ‌తులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. ప్ర‌భాస్‌లో ఉన్న ఈ కోణాన్ని చూసి కూడా ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరుగుతోంది. (చ‌ద‌వండి:మూడు సినిమాల నుంచి తప్పించారు)

Advertisement
 
Advertisement
Advertisement