కేజీఎఫ్‌తో పాటు ‘సలార్‌’ గ్లింప్స్‌, ఆడియన్స్‌కి ప్రశాంత్‌ నీల్‌ డబుల్‌ ట్రీట్‌ | Is Prabhas Salaar Movie Glimpse With Yash KGF 2 On April 14th | Sakshi
Sakshi News home page

KGF-Salaar: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్‌’, ఆడియన్స్‌కి ప్రశాంత్‌ నీల్‌ డబుల్‌ ట్రీట్‌

Apr 8 2022 1:11 PM | Updated on Apr 8 2022 1:28 PM

Is Prabhas Salaar Movie Glimpse With Yash KGF 2 On April 14th - Sakshi

Salaar Movie Glimpse With Yash KGF 2: డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఆడియన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నాడట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ఏప్రిల్‌ 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదల రోజే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్‌ ప్రదర్శిస్తోన్న అన్ని థియేటర్లలో సలార్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ తాజా బజ్‌ ప్రకారం ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2తో పాటు ప్రభాస్‌ సలార్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 

చదవండి: బన్నీకి మెగాస్టార్‌ క్రేజీ విషెస్‌, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్‌

ఈ రెండు చిత్రాల డైరెక్టర్‌ ఒక్కడే కావడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. ఇది తెలిసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. కాగా కేజీఎఫ్‌ మూవీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్‌ 1 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దీనికి స్వీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్‌ 2 మాస్‌ ప్రభంజనం సృష్టించడం ఖాయమంటున్నారు సినీ ప్రియులు. దీంతో వారం రోజుల్లో రిలీజ్‌ కాబోతోన్న ఈమూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, విడుదలకు ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సలార్‌ అప్‌డేట్‌ ఇదే తెరపై రావడం ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులు నిజంగా డబుల్‌ ట్రీటే అవుతుంది. కేజీఎఫ్‌ 2లో యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: అంబులెన్స్‌లో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌, ఫొటో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement