ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్‌ | Girl Fan Slapped Actor Prabhas After Taking Selfie With Him In Airport, Old Video Goes Viral - Sakshi
Sakshi News home page

Fan Slaps Prabhas Viral Video: ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ చెంపపై కొట్టిన యువతి.. పాత వీడియో వైరల్‌

Oct 3 2023 10:59 AM | Updated on Oct 3 2023 11:37 AM

Prabhas Fan Slaps After Selfi - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సౌత్‌,నార్త్‌ నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన ప్రభాస్‌ సినిమాలు కాస్త నిరాశపర్చినా ఆయనపై అభిమానం కూసింత కూడా వారిలో తగ్గలేదు. ముఖ్యంగా తన ఫ్యాన్స్‌ను ప్రభాస్‌ ఎక్కడా నిరుత్సాహపరచడు. అడిగినవారందరికీ సాయం చేయడమే కాకుండా ఎప్పుడూ వారికి పెద్ద పీట వేస్తాడు. అందుకే ఆయన అంటే ఫ్యాన్స్‌కు కూడా ఎనలేని అభిమానం.

(ఇదీ చదవండి: సినిమా ఛాన్సుల కోసం దేవయాని ఇలాంటి తప్పులు చేసిందా .. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది)

ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి. ఎయిర్‌పోర్టులో డార్లింగ్‌ను గుర్తించిన ఆ యువతి ఫోటో దిగిన అనంతరం ప్రభాస్‌ చెంపపై తన చేతితో ప్రేమగా కొడుతుంది. ఆ క్షణం తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు.

అప్పుడు ప్రభాస్‌ కూడా నవ్వుతూ ఆనందించాడు. ఆమె ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు, ముఖ్యంగా ప్రభాస్.. వీడియోలో, గందరగోళంగా చిరునవ్వు అందరినీ కట్టిపడేసింది. యాదృచ్ఛికంగా మరికొద్దిరోజుల్లో ప్రభాస్‌ సలార్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రభాస్‌కు సంబంధించిన పలు వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్‌ 22న సలార్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పుడు షారుక్‌ ఖాన్‌ డుంకీ సినిమాతో పోటీ పడుతున్నాడు మన డార్లింగ్‌ ప్రభాస్‌.

(ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్‌ మార్చేసిన మహేశ్‌ బాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement