
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది.
తాజాగా ఆదివారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్ట్ కె సెట్‌లో ప్రభాస్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. సెట్‌లో భారీగా టపాసులు పేల్చుతూ మూవీ టీం డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్ వేదికగా పంచుకుంది.
From the Sets of #ProjectK, Wishing the one and only darling #Prabhas a very Happy Birthday ❤️💫@nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @VyjayanthiFilms #HappyBirthdayPrabhas pic.twitter.com/GJY9ClRUHu
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 22, 2022