
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా (‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్‌కాస్ట్ వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ‘స్పిరిట్’ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కోరగా.. ‘‘సెప్టెంబరు నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌కి వెళుతుంది. షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్‌గా పూర్తి చేస్తాం’’ అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానమిచ్చారు సందీప్ రెడ్డి.
ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటిస్తారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ ఈ చిత్ర నిర్మాతలు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.