Fear In Bollywood As Prabhas Adipurush Movie Collections Create Records, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్‌.. కారణాలు ఇవే

Jun 23 2023 11:41 AM | Updated on Jun 23 2023 12:54 PM

Prabhas Adipurush Create Records Scaring Bollywood - Sakshi

కటౌట్‌ ఉన్నోడు కొంతవరకు మాత్రమే హైలెట్‌ అవుతాడు.. దిమాకున్నోడు దునియా మొత్తాన్నే ఏలుతాడు. తాజాగా బాలీవుడ్‌లో ప్రభాస్‌ రేంజ్‌ చూస్తే ఇలానే ఉంది. ఇప్పటికే వరుసగా తన నాలుగు సినిమాలు రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. దీంతో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ దెబ్బకు బాలీవుడ్‌ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తాజాగా ఆదీపురుష్‌ సినిమాపై డివైడ్‌ టాక్‌ వినిపించినా కలెక్షన్ల పరంగా పలు రికార్డుల దుమ్ము దులిపేశాడు. మొదటి మూడురోజుల్లోనే రూ.340 కోట్ల గ్రాస్‌ని వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలా ఐదురోజుల్లోనే రూ. 400 కోట్ల మార్క్‌ను కూడా దాటేశాడు.

(ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ.. బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన నటి)

దేశం మొత్తం ఆదీపురుష్‌పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇలాంటి కలెక్షన్లు రావడం చాలా కష్టం కానీ ప్రభాస్‌ ప్రభంజనంతో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికే బాహుబలి రెండు భాగాలతో పాటు సాహో కూడా రూ. 300 కోట్ల మార్కును దాటిన జాబితాలో ఉన్నాయి.  ఇదే లిస్ట్‌లోకి ఆదిపురుష్‌ వచ్చి చేరింది. ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్‌ సాధ్యపడలేదు. ప్రభాస్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. బాలీవుడ్‌లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి సాధ్యమయ్యే ఈ అరుదైన ఫీట్‌ను టాలీవుడ్‌ నుంచి వచ్చిన ప్రభాస్‌ క్రియేట్‌ చేయడంతో వారిప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

కంటెంట్‌ లేదంటున్న సినిమాతోనే ఇన్ని రకాల విధ్వంసాలు సృష్టిస్తే...  సలార్‌తో పాటు ప్రాజెక్ట్‌ కే చిత్రాలతో వస్తున్న ప్రభాస్‌ను ఇంకెవరు ఆపలేరని వారు అంచనా వేస్తున్నారు. రాబోయేరోజుల్లో ప్రభాస్‌ నుంచి బాలీవుడ్‌ హీరోలకు అతిపెద్ద ప్రమాదమే పొంచి ఉందని అక్కడి క్రిటిక్స్‌ అంచనా వేస్తున్నారు.

వారి అంచనాలు నిజమయ్యేలా తాజాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి ‘సలార్‌’ గురించి మాట్లాడి అంచనాలను భారీగా పెంచేసింది.'సలార్‌’ సినిమా ‘కేజీఎఫ్‌’కు మించి ఉంటుంది. ఒకరకంగా రెండు కేజీఎఫ్‌ సినిమాలకు సమానంగా సలార్‌ వస్తుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్‌, యాక్షన్‌ను చూడలేదు. ప్రశాంత్‌ నీల్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ప్రభాస్‌ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడు. ఇందులోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది' అని ఆమె చెప్పింది. సెప్టెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

(ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement