సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్‌ | Pooja Hegde Secret Boyfriend Photos Exposed Social Media | Sakshi
Sakshi News home page

సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్‌

Published Mon, Apr 1 2024 9:49 AM | Last Updated on Mon, Apr 1 2024 10:27 AM

Pooja Hegde Secret Boyfriend Photos Exposed Social Media - Sakshi

రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్‌ పూజా హెగ్డే (33).. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది, పూజా హెగ్డే ఒక క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆమె అభిమానులకు ఉపశమనం కలిగింది.

అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్న ప్రకారం..  బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (33) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటల్లు,  రెస్టారెంట్లకు తరచూ వెళ్లడం కనిపించిందని చెబుతున్నారు. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2    ఫేమ్‌  'తారా  సుతారియా'తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఎవరీ రోహన్ మెహ్రా
ఉత్తరాంచల్‌కు చెందిన రోహన్ మెహ్రా  ఇంకా బాలీవుడ్‌లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతని నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు  ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10వ సీజన్‌లో సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన రోహన్‌  5వ స్థానంలో నిలిచాడు. ఆయన ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితం అయ్యాడు. అలా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు.

అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు.  మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా? లేక వారిద్దరూ జస్ట్‌ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్‌ చేస్తే కానీ ఎవరికీ తెలియదు.

సల్మాన్‌తో రిలేషన్‌.. అప్పుడు పూజా రియాక్షన్‌ ఇదే
బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్‌ఖాన్‌తో  పూజా హెగ్డే  ప్రేమలో ఉందంటూ ఎన్నో  వార్తలు వచ్చాయి.. వాటిపై గతేడాది ఆమె ఇలా రియాక్ట్‌ అయింది. 'నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్‌నే. నాకు సింగిల్‌గా ఉండటమే  ఇష్టం. అలాగే, నా ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.' అని ఆమె స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement