Ponniyin Selvan 2: Trailer And Audio Launch Event Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan 2 Update: విడుదల తేదీలో మార్పులేదు

Mar 4 2023 3:49 PM | Updated on Mar 4 2023 4:14 PM

Ponniyin Selvan 2: Trailer and audio launch event date finalised - Sakshi

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పాతికేళ్ల కలను సాకారం చేసిన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. లైకా ప్రొడక్షన్‌తో కలిసి ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. నటుడు విక్రమ్, జయంరవి, కార్తీ, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్థిబన్, విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా రెండు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగంపై మరింత అంచనాలు నెలకొన్నాయి.

 రెండవ భాగం 2023 ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు తొలిభాగం విడుదల సమయంలోనే ప్రకటించారు. అయితే తాజాగా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఆలస్యం కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో చిత్ర విడదలపై క్లారిటీ ఇచ్చేవిధంగా చిత్రం మేకింగ్‌ వీడియోలు చిత్ర వర్గాలు విడుదల చేశారు. అందులో పొన్నియిన్‌ సెల్వన్‌–2 చిత్రం ముందుగా ప్రకటించిన విధంగానే ఏప్రిల్‌ 28న విడుదలవుతుందని స్పష్టం చేశారు.

 చిత్ర ఆడియో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ఈనెల, 30 లేదా ఏప్రిల్‌ 5న స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌–2లో ఆరుపాటలు ఉంటాయని, ఇందులో ఆదిత్యా కరికాలన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయిన శత్రు వర్గాలు కుట్రపన్ని ఆయన్ని ఘోరంగా చంపే సన్నివేశాలు, ఐశ్వర్యారాయ్‌ రహస్య సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. తొలిభాగం కంటే రెండవ భాగం మరింత ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని అంటున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement