
ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) నుంచి కొత్తకొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'పోలీస్ పోలీస్' (Police Police) అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతుందని ఒక ప్రోమోను పంచుకుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ తమిళ్‌లో తెరకెక్కుతుంది. కానీ, తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు, లవ్, కామెడీ వంటి కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ ఉండనుంది.