Aishwarya Rajinikanth: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు..

Police Held 2 Domestic Help, Driver For Stealing Jewellery From Aishwarya Rajinikanth Home - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో ఇటీవల దుండగులు దొంగతనానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్‌ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐశ్వర్య అనుమానించినట్టుగానే ఆమె ఇంటి పనివాళ్లే ఈ చోరీ చేసినట్లు వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో దొంగతనం జరగగా ఈ ఘటనలో 60 లక్షలు విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో ఐశ్వర్య తేనాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చదవండి: అమ్మ ప్రెగ్నెంట్‌ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసివిచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య నివాసంలో దాదాపు 18 ఏళ్లుగా పని చేస్తున్న మండవేలికి చెందిన ఈశ్వరి(46) మరో మహిళ లక్ష్మి, డ్రైవర్‌ వెంకటేశ్‌తో పాటు మరో ముగ్గురు ఈ దొంగతనానికి తెగబడ్డారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు అనేక కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారు పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: డ్రగ్స్‌ కేసులో అడ్డంగా దొరికిపోయిన నటి.. దంపతులమని నమ్మించి మరో వ్యక్తితో కలిసి గది అద్దెకు..

అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. కాగా తన ఇంట్లో చోరి జరగడంతో పోలీసుల ఆశ్రయించిన ఐశ్వర్య తన ఇంటి పనివాళ్లైన ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకటేశన్‌తో సహా ముగ్గురిపై అనుమానం ఉందని, తరచూ వారు తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లవారని.. లాకర్‌ కీలు కూడా ఎక్కడ ఉన్నాయో వారికి తెలుసని ఆమె ఫిర్యాదు పేర్కొంది. కాగా ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top