అమ్మ‌కు ఆప‌రేష‌న్‌.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Payal Rajput: అంద‌రూ ప్రార్థించండి.. వేడుకుంటున్న పాయ‌ల్‌

Published Fri, Feb 23 2024 10:41 AM

Payal Rajput Says Her Mother Went Knee Surgery - Sakshi

హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న త‌ల్లికి స‌ర్జ‌రీ చేయించింది. గ‌త‌కొంత‌కాలంగా మోకాలి నొప్పుతో బాధ‌ప‌డుతున్న త‌ల్లికి ఆపరేష‌న్ చేయించింది. ఈ విష‌యాన్ని పాయ‌ల్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. అమ్మ‌కు నీ రీప్లేస్‌మెంట్ సర్జ‌రీ జ‌రిగింద‌ని, ఇది చాలా నొప్పితో కూడుకున్న‌ద‌ని పేర్కొంది.  ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైంద‌ని, అమ్మ‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపింది. త‌న‌కోసం ప్రార్థించండి అని వేడుకుంది. ఆప‌రేష‌న్ అనంత‌రం త‌న త‌ల్లి న‌డిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 

సీరియ‌ల్స్ నుంచి సినిమాల్లోకి..
పాయ‌ల్ కెరీర్‌ విష‌యానికి వ‌స్తే..  మొద‌ట్లో ఆమె హిందీ సీరియ‌ల్స్ చేసింది. దాదాపు ఏడేళ్ల‌పాటు బుల్లితెర‌కే ప‌రిమిత‌మైన ఆమె 2017లో చ‌న్నా మెరియా అనే పంజాబీ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేసింది. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాయ‌ల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

మంగ‌ళ‌వారంతో స‌త్తా చాటిన పాయ‌ల్‌
వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. గ‌తేడాది రిలీజైన‌ మంగ‌ళ‌వారం సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపించింది పాయ‌ల్‌. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో కిరాత‌క అనే మూవీలో న‌టిస్తోంది.

చ‌ద‌వండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్‌ సినిమా

Advertisement
Advertisement