పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌ !.. ఆ సినిమా నుంచి | Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Crazy Update | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌ !.. ఆ సినిమా నుంచి

Jan 9 2022 3:15 PM | Updated on Jan 9 2022 3:15 PM

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Crazy Update - Sakshi

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Crazy Update: పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున‍్న భీమ్లా నాయక్‌ మూవీ వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25కి పోస్ట్‌పోన్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే నిరాశలో ఉన్న పవన్‌ అభిమానులను ఉత్తేజపరిచేందుకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పినట్లు సమాచారం. పవన్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'భవదీయుడు భగత్‌ సింగ్‌'. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్‌ చేశానని దేవీశ్రీ తెలిపాడట. సినిమాలోని ఈ సాంగ్స్‌ ఎనర్జిటిక్‌, మెలోడియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.  

టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ కొట్టిన పవన్‌ కల్యాణ్‌ సినిమా గబ్బర్‌ సింగ్‌. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరీశ్ శంకర్‌తో పవర్‌ స్టార్‌ కాంబో  రిపీట్‌ కానుంది. దీంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్‌ 28వ చిత్రంగా వస్తోన్న 'భవదీయుడు భగత్‌  సింగ్‌' సినిమాకు ఇది కేవలం వినోదం మాత్రమే కాదు అంటూ ఇచ్చిన క్యాప్షన్‌ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 

ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట

Advertisement
 
Advertisement
Advertisement