Pa Ranjith: రిలీజ్‌కు రెడీ అవుతున్న పా.రంజిత్‌ మూవీ నక్షత్రం నగర్దిరదు

Pa Ranjith New Movie Nakshatram Nagargirathu Ready For Release - Sakshi

దర్శకుడు పా.రంజిత్‌ చిత్రాల నేపథ్యం ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రజనీకాంత్‌ హీరోగా కబాలీ, కాలా, వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవలే సార్‌పట్టా పరంపరై సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. తాజాగా నక్షత్రం నగర్గిరదు పేరుతో వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. యాళీ ఫిలింస్‌ సంస్థతో కలిసి పా.రంజిత్‌ నీలం ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్‌ జయరామ్‌, తుషారా విజయన్‌, కలైయరసన్‌, షబీర్‌, హరి, దాము, వినోద్‌, సుభద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమ ప్రధానాంశంగా తెరకెక్కించిన చిత్రం అని యూనిట్‌ వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రేమకు రాజకీయాలు పులిమి, కులాల రంగు పూసి కాలం గడిపేస్తున్న మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. దీనికి కిశోర్‌ ఛాయాగ్రహణం, డెన్మా సంగీతాన్ని అందించారు.

చదవండి:  ఆరేళ్ల రిలేషన్‌.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top