బేబీ బంప్‌తో నుస్రత్‌ జహాన్‌.. ఫొటోలు వైరల్‌

Nusrat Jahan Shares Her Baby Bump New Photos Attracts Netizens - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వబోయే ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘తప్పిపోయిన పక్షికి ఇంటికి వెళ్లే దారి గురించి మార్గదర్శనం చేద్దాం’’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. మిక్కీ మౌజ్‌ బొమ్మలతో కూడిన డిజైన్‌ గల డ్రెస్‌ ధరించిన కాబోయే అమ్మ నుస్రత్‌కు ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

‘‘ఎంతో అందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీదీ. పుట్టబోయే బిడ్డ గురించి మీరు కనే కలలు నిజమవ్వాలి’’ అంటూ ఫ్యాన్స్‌ నుస్రత్‌ జహాన్‌కు విషెస్‌ తెలియజేస్తున్నారు. కాగా బెంగాల్‌ సినీ నటి అయిన నుస్రత్‌ జహాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2019లో లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. అదే ఏడాది జూన్‌ 19న నిఖిల్‌ జైన్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే, కొంతకాలం సఖ్యతగా మెలిగిన దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. 

ఈ విషయంపై స్పందించిన నుస్రత్‌ జహాన్‌.. నిఖిల్‌తో జరిగిన తన వివాహం భారత చట్టాల ప్రకారం చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా భర్త, అత్తింటి వారు తన నగలు, విలువైన వస్తువులను తనకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంపై కూడా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నుస్రత్‌ జహాన్‌.. వరుసగా ఫొటోలు షేర్‌ చేస్తూ వాటన్నింటికీ ఫుల్‌స్టాఫ్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

చదవండి: అవును మేము గతేడాది నుంచి విడిగా ఉంటున్నాం: నిఖిల్‌ జైన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top