టీవీలో నటిస్తున్నప్పుడే ఆ విషయం తెలిసింది: హీరోయిన్‌

Nushrat Bharucha Special Story - Sakshi

గ్లామర్‌తో ఆకట్టుకున్నా స్థిరపడేది నటనతోనే అని నమ్ముతుంది నుస్రత్‌ భరూచా. అందమైన రూపం, అభినయ కౌశలం రెండిటికీ పోటీపెడుతూ టీవీ, సినిమా, ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 

ముంబైలో పుట్టిపెరిగింది నుస్రత్‌. తన్వీర్‌ భరూచా, తస్నీమ్‌ భరూచాల ఏకైక సంతానం. కూతురు ఏది అడిగితే అది కాదనకుండా సమకూర్చినప్పటికీ ఆమె  సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం ‘నో ’ అన్నారు  నుస్రత్‌  అమ్మానాన్నా.  దాంతో వాళ్లకు తెలియకుండానే ఆడిషన్స్‌ అటెండ్‌ అయింది. అలా  ‘కిట్టీ పార్టీ’ అనే టీవీ సిరీయల్‌కు సెలక్ట్‌ అయ్యింది.

సాయంకాలానికల్లా  ఇంటికి చేరుతూ..తను టీవీ సీరియల్‌లో నటిస్తున్న  విషయాన్ని తల్లి, తండ్రి దగ్గర  దాచి పెట్టింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో  చెప్పక తప్పలేదు. వాళ్లూ ఒప్పుకోక తప్పలేదు. 

2006లో ‘కల్‌ కిస్నే దేఖా’, ‘జై సంతోషీ మా’ సినిమాలు చేసింది.  వీటితో ఆమెకు పెద్దగా  గుర్తింపు రాలేదు. 2010లో తెలుగులో శివాజీ హీరోగా నటించిన ‘తాజ్‌ మహాల్‌’, తమిళంలో ‘వాలిబా రాజా’  చిత్రాల్లోనూ నటించింది. ఇవీ అంతే.. నుస్రత్‌కు బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి.  

 అయితే, 2011లో విడుదలైన  ‘ప్యార్‌ కా పంచ్‌నామా’ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టింది.  అందులో ఔనంటే కాదని.. కాదంటే ఔననే ప్రేమికురాలిగా.. బ్యాడ్‌ గర్ల్‌గా  ఆమె కామెడీ టైమింగ్‌  విమర్శకుల ప్రశంసలను అందుకుంది.అనేక అవార్డులూ ఆమెను  వరించాయి. ఆ తర్వాత వచ్చిన  ఆ సినిమా సీక్వెల్‌ ‘ప్యార్‌ కా పంచ్‌నామా 2’ కూడా సూపర్‌ హిట్‌ అయింది. 

‘సోనూ కే టిటూ కీ స్వీటీ’, ‘డ్రీమ్‌ గర్ల్‌’ సినిమాలూ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

► ప్రస్తుతం వెబ్‌ దునియాలోనూ తన సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ‘అజీబ్‌ దాస్తా’ లో చెల్లెలి భవిష్యత్తు కోసం పోరాడే అక్కగా మెప్పించింది. 

నటన అంటే ఆషామాషీ కాదని, ఇందుకు బాగా కష్టపడాలనే సత్యం  టీవీలో నటిస్తున్నప్పుడే తెలిసింది. అదీగాక హీరో కంటే హీరోయిన్‌ కెరీర్‌  తొందరగా ముగిసిపోతుంది. అందుకే ఉన్నన్నాళ్లూ మంచి సినిమాలు ఎంచుకుని సంతోషంగా గడపడానికే ఇష్టపడతాను.
– నుస్రత్‌ భరూచా 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top