Actor Jr NTR Shocking Remuneration For McDonalds Ad, Deets Inside - Sakshi
Sakshi News home page

Jr NTR McDonalds Ad: ఒక్క యాడ్‌ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!

Jun 12 2023 4:19 PM | Updated on Jun 12 2023 5:29 PM

ntr remuneration for mcdonald's ad - Sakshi

రీసెంట్ గా జస్ట్ ఓ యాడ్ లో నటించినందుకు ఏకంగా అ‍న్ని కోట్లు అందుకున్నాడట.

‍యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన తారక్.. రాజమౌళి తీసిన ఈ సినిమా దెబ్బకు గ్లోబల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్ లో కూడా తన గురించి మాట్లాడుకునేలా యాక్టింగ్ తో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. దీంతో సినిమాలు, యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. రీసెంట్ గా జస్ట్ ఓ యాడ్ లో నటించినందుకు ఏకంగా కొన్ని కోట్లు అందుకున్నాడు.

'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడం ఏమో గానీ అందులో హీరోలుగా చేసిన చరణ్, ఎన్టీఆర్ మాత్రం వేరే లెవల్లో ఫేమస్ అయిపోయారు. బడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్న ఎన్టీఆర్.. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గానూ ఉన్నాడు. ఈ మధ్య ప్రముఖ సంస్థ మెక్ డొనాల్డ్స్ యాడ్ లో నటించిన తారక్.. దీని ఒక్కదాని కోసమే ఏకంగా రూ.6-8 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడట.

ఎన్టీఆర్ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ తెలిసిన ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. రోజురోజుకి తమ అభిమాన హీరో సినిమాలతో పాటు మిగతా విషయాల్లోనూ అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం 'దేవర' చేస్తున్న ఎన్టీఆర్.. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి వర్క్ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?)

Advertisement
 
Advertisement
Advertisement