'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్ | Ntr Devara Movie Saif Ali Khan Glimpse | Sakshi
Sakshi News home page

Devara Movie: 'దేవర' మరో అప్‌డేట్.. విలన్‌గా సైఫ్

Aug 16 2024 4:42 PM | Updated on Aug 16 2024 4:51 PM

Ntr Devara Movie Saif Ali Khan Glimpse

ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.

(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)

దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌లో ఐరన్ థ్రోన్‌ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.

జాన్వీ కపూర్‌తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.

(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)

Advertisement
 
Advertisement
Advertisement