తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర' | Sakshi
Sakshi News home page

Devara Release Date: 'పుష్ప 2'తో కాదు.. సోలోగానే బరిలో 'దేవర'

Published Fri, Feb 16 2024 4:39 PM

Ntr Devara Movie New Release Date Details - Sakshi

అనుకున్నదే జరిగింది. గత కొన్నిరోజుల నుంచి 'దేవర' వాయిదా పడిందనే మాట నిజమైంది. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 5న రావట్లేదని, దసరాకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అక్టోబరు 10న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్లానింగ్ క్రేజీగా అనిపించింది.

(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

'ఆర్ఆర్ఆర్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విలన్‌గా చేస్తున్న సైఫ్ అలీఖాన్‌కి గాయం, పాటలు-గ్రాఫిక్ వర్క్ పెండింగ్ వల్ల తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఆగస్టు 11న 'పుష్ప 2'కి పోటీగా దీన్ని బరిలో దింపుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది.

అయితే దసరా కానుకగా అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తున్న 'దేవర'కు బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ప్రభాస్ 'కల్కి'.. ఆగస్టులో బన్నీ 'పుష్ప 2'.. సెప్టెంబరులో పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ అవుతాయి. అక్టోబరులో 'దేవర' వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు సోలో రిలీజ్ కన్ఫర్మ్. చిరంజీవి, బాలయ్య చేస్తున్న సినిమాలు సంక్రాంతికే రిలీజ్ పెట్టుకున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే 'దేవర' రిలీజ్ విషయంలో టీమ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ)

Advertisement
Advertisement