వరుణ్ సందేశ్‌ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్‌: నిఖిల్ సిద్దార్థ్ | Actor Nikhil Siddharth Interesting Comments On Ninda Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Nikhil Siddharth: వరుణ్ సందేశ్‌ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్‌

Published Mon, Jun 17 2024 2:34 PM | Last Updated on Mon, Jun 17 2024 4:04 PM

Nikhil Siddharth Comments On Ninda Movie

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ..  ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి.  నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ ఈ సినిమాను నాకు చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్‌ప్రైజ్ అవుతారు’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement