ప్రేమించడానికి కారణం ఉండకూడదు.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్‌ ట్రైలర్‌ | Sakshi
Sakshi News home page

18 Pages Movie Trailer: ప్రేమించడానికి కారణం ఉండకూడదు.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్‌ ట్రైలర్‌

Published Sat, Dec 17 2022 7:37 PM

Nikhil Siddharth, Anupama Parameswaran 18 Pages Trailer Release - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్‌.  ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్‌’ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. యూత్‌లో బాగా బజ్‌ క్రియేట్‌ అయిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్‌. 

అద్భుతమైన విజువల్స్‌తో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు ట్రైలర్‌లో. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలోని ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్‌లో చూపించారు. ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు’ వంటి డైలాగ్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement