Niharika Konidela : గంగూబాయిలా అచ్చు దించేసిన నిహారిక.. ఫోటోలు వైరల్‌

Niharika Konidela Turns As Gangubai For Coustume Party Photos Viral - Sakshi

మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక  `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్‌ నటించిన గంగూబాయ్‌ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

సంజ‌య్ లీలా బ‌న్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్రసింహా బర్త్‌డే పార్టీకి వచ్చిన నిహారిక గంగూబాయిలా అచ్చం దించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా అల్లు అర్జున్‌ భార్య స్నేహా, శ్రీజ సహా పలువురు కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top