నిహారిక ఇంట ప‌సుపు ఫంక్ష‌న్‌ | Niharika Konidela Shares Her Pasupu Function | Sakshi
Sakshi News home page

నిహారిక పెళ్లి ప‌నులు షురూ

Aug 18 2020 9:14 AM | Updated on Aug 18 2020 2:15 PM

Niharika Konidela Shares Her Pasupu Function - Sakshi

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు, న‌టి నిహారిక కొణిదెల పెళ్లి ప‌నులు ఊపందుకున్నాయి. శ్రావ‌ణ సోమ‌వారం నాడు ప‌సుపు దంచే కీల‌క‌ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఈ ముఖ్య ఘ‌ట్టానికి మెగా కుటుంబంలోని ఆడ‌వాళ్లంద‌రూ హాజ‌ర‌య్యారు. పెళ్లిక‌ళ ఉట్టిప‌డుతున్న నిహారిక ప‌సుపు కొమ్ములు దంచుతూ ఫొటోల‌కు పోజిచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియోను నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు పోలీసు శాఖ‌లో ఐజీగా విధులు నిర్వ‌ర్తిస్తున్న జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ కుమారుడు, బిజినెస్‌మేన్ చైత‌న్య‌తో నిహారిక ఏడ‌డుగులు వేయ‌బోతున్నారు. కాగా, వీరి పెళ్లి ముహూర్తాన్ని వెల్ల‌డించాల్సి ఉంది.

ఇటీవ‌లే నిహారిక‌- చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ నిశ్చితార్థం వేడుక‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే.  ఈ నిశ్చితార్థ‌పు ముహూర్తానికి పవన్‌ కళ్యాణ్‌ మినహా మిగ‌తా మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ హాజ‌ర‌య్యారు. నిజానికి ప‌వ‌న్ చాతుర్మాస్య దీక్ష‌లో ఉన్నారు. గ‌త నెల ఈ దీక్ష‌కు పూనుకున్నారు. ఇది‌ నాలుగు నెల‌ల‌పాటు కొన‌సాగుతుంది. ఈ దీక్ష‌లో ఉన్న‌ప్పుడు సాయంత్రం ఆరు త‌ర్వాత‌ ఇల్లు విడిచి వెళ్ల‌కూడ‌దు. ఎంగేజ్‌మెంట్ రాత్రి పూటే జ‌ర‌గ‌డంతో ఆ వేడుక‌లో ప‌వ‌న్ క‌నిపించ‌లేదు. అయితే ఈ కార్యక్రమానికి ముందుగానే నాగ‌బాబు నివాసానికి వెళ్లి నిహారిక‌ను, ఆమెకు కాబోయే భ‌ర్త చైత‌న్య‌ను పవన్‌ కల్యాణ్ ఆశీర్వదించారు (వైభ‌వంగా నిహారిక నిశ్చితార్థం)

Advertisement
 
Advertisement
Advertisement