నిహారిక లవ్ లెటర్‌.. సోషల్ మీడియాలో వైరల్! | Sakshi
Sakshi News home page

Niharika Konidela : నిహారిక ప్రేమ లేఖ.. ఎవరికో తెలుసా?

Published Tue, Nov 14 2023 1:38 PM

Niharika Konidela Love Letter To All Favourite People In Her Life - Sakshi

నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలో పెళ్లిలో సందడి చేసింది. అన్న పెళ్లి డ్యాన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ జరిగిన గ్రాండ్ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది. అయితే ప్రస్తుతం మరో పెద్ద బాధ్యతను నిహారిక తీసుకుంది. దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ - లావణ్య కూడా హాజరయ్యారు.

అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైనవారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ ఓక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు 'లవ్ లెటర్‌ టూ ఆల్ మై ఏంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కూడా ఉన్నారు. నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీతో గడిపిన క్షణాలు నా  జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామంట్స్ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement