రెండో పెళ్లి చేసుకుంటా.. కాకపోతే.. : నిహారిక | Niharika Comments On Second Marriage Thoughts | Sakshi
Sakshi News home page

Niharika: మళ్లీ ప్రేమ పుట్టదనుకుంటే మూర్ఖత్వమే.. పెళ్లి చేసుకుంటా..

Mar 15 2024 11:34 AM | Updated on Mar 15 2024 11:59 AM

Niharika Comments On Second Marriage Thoughts - Sakshi

'నాకు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే! ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదు. ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో

విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరు.. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్‌ చేయరు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల విషయంలోనూ అదే జరిగింది. బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేసింది. 2020 ఆగస్టు 13న ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా అదే ఏడాది డిసెంబర్‌ 9న పెళ్లి చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లంటే ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందేగా! ఎంతో ఆర్భాటంగా వివాహం జరిపించారు. కానీ ముచ్చటగా మూడేళ్లు కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు.

నా పెళ్లి వర్కవుట్‌ కాలే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'నాకు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే! ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదు. ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయి. అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కవుట్‌ కాలేదు. అలా అని మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. త్వరలో అని చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది.

బిల్లు కట్టి బయటకు వస్తుంటే..
ఎక్కువ బాధపెట్టిన సంఘటన గురించి మాట్లాడుతూ.. 'రాడిసన్‌ బ్లూ పబ్‌ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు చాలా అరుదుగా వెళ్తుంటాను. ఆరోజు నేను అక్కడ మా స్కూల్‌ ఫ్రెండ్స్‌ను కలిశాను. ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్‌ మాకు ఇబ్బందిగా ఉండటంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాకేం అర్థం కాలేదు. మీడియాలో ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్‌ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలసుకున్నాను' అని చెప్పుకొచ్చింది నిహారిక.

చదవండి: ‘రజాకార్‌’ మూవీ ఎలా ఉందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement