మెట్టినింట్లో నిహారిక ఫస్ట్‌ బర్త్‌డే.. పార్టీ ఎక్కడంటే

Niharika Celebrate First Birthday After Marriage With Husband - Sakshi

టాలీవుడ్‌ నటి, మెగా డాటర్‌ నిహారిక నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఈ కొత్త పెళ్లి కూతురు 28వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠి, కాజల్‌ అగర్వాల్ విషెస్‌ తెలిపారు. ఇ​క మెట్టినింట్లో అడుగుపెట్టాక నిహారిక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తన భార్యకు చైతన్య జొన్నలగడ్డ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్‌ వికసిస్తోందన్న నేపథ్యంలో నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో చైతన్య జీవితం కూడా వికిసించిందని ప్రేమగా వివరించాడు. చదవండి: ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను: నిహారిక

కాగా నిహారిక తన బర్త్‌డేను నేడు భర్త చైతన్యతో కలిసి ఫలక్‌నామ ప్యాలెస్‌లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఫలక్‌నామ ప్యాలెస్‌కు ఈ జంట చేరుకున్నట్లు సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు గ‌త రాత్రి నిహారిక.. తండ్రి నాగబాబు, బుల్లితెర షో ‘అదిరింది’ కమెడీయన్స్‌తో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో యాంక‌ర్ ర‌వి, రాఘ‌వ‌, ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్త్ న‌టులు, అదిరింది న‌టులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం నిహారిక బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా ఇటీవల నిహారిక పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 9న  జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి హడావిడి చేయడం ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. చదవండి: ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top