రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం | Niharika And Bunny Vas Cricket War | Sakshi
Sakshi News home page

రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం

Jul 19 2024 6:34 PM | Updated on Jul 19 2024 6:50 PM

Niharika And Bunny Vas Cricket War

టాలీవుడ్‌ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో సరికొత్త ప్లాన్‌తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్‌ సభ్యులు క్రికెట్‌లో పోటీ పడ్డారు.

ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బ‌న్నీ వాస్‌ నిర్మాతగా ఉన్నారు. క‌మిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధ‌మంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. రెండు టీమ్స్ మ‌ధ్య  క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బ‌న్నీ వాస్‌, నిహారిక కొణిదెల మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా చాలెంజ్‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. బ‌న్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీక‌రించారు. క‌చ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ క‌మిటీ కుర్రోళ్ళు టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని ఆమె న‌మ్మ‌కంగా ఉన్నారు.

జూలై 19న సాయంత్రం ఆరు గంట‌ల‌కు మ్యాచ్‌ ప్రారంభమైంది.  ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ రెండు సినిమాలు గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌తోనే తెర‌కెక్కాయి. క్రికెట్‌, మూవీ ల‌వ‌ర్స్‌ను ఈ మ్యాచ్ ఆక‌ట్టుకుంటుంద‌నటంలో సందేహం లేదు.

ఆయ్ సినిమా గురించి
ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆక‌ట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, అంకిత్ కొయ్య త‌దిత‌రులు ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌ష్టు 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రొడ్యూస‌ర్‌ బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

క‌మిటీ కుర్రోళ్ళు సినిమా గురించి
నిహారిక కొణిదెల స‌మర్ప‌ణ‌లో రూపొందుతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగ‌ష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ స‌రోజ్‌, య‌శ్వంత్ పెండ్యాల‌, త్రినాథ్ వ‌ర్మ‌, ప్ర‌సాద్ బెహ‌రా, ఐశ్వ‌ర్య ర‌చిరాజు, మ‌ణికాంత ప‌రుశు, లోకేష్ కుమార్ ప‌రిమి, శ్యామ్ క‌ళ్యాణ్, ర‌ఘువ‌ర‌న్‌, శివ కుమార్ మ‌ట్ట‌ త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. య‌దు వంశీ ద‌ర‌క్శ‌క‌త్వంలో    పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై   పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement