Akash Puri's Peene Ke Baad Romantic Song Out Now - Sakshi
Sakshi News home page

Romantic: ఆకట్టుకుంటున్న ఆకాశ్‌ పూరి కొత్త సాంగ్‌ ‘పీనే కే బాద్‌’

Oct 13 2021 8:42 AM | Updated on Oct 13 2021 10:10 AM

New Song Released From Akash Puris Romantic Movie - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌గా..

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌గా నటించారు. అనిల్‌ పాడూరి దర్శకుడు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పీనే కే బాద్‌’ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 

‘‘హ్యాపీ హ్యాపీ మామ.. దిల్‌ ఖుష్‌ అవుతుందే పీనేకే బాద్‌...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు ‘పీనే కే బాద్‌’ పాట లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట థీమ్‌కు తగ్గట్లు పబ్‌లో షూట్‌ చేశాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల లిరిక్స్‌ అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు సునీల్‌ కశ్యపే పాడారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన చిత్రం నవంబరు 4న విడుదల కానుంది.

చదవండి: స‌ల్మాన్ ఖాన్‌ని డైరెక్ట్‌ చేయనున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement