చంద్రయాన్-3 సక్సెస్.. ప్రకాశ్‌ రాజ్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్న నెటిజన్స్! | Netizens Trolling Actor Prakash Raj After Chandrayan-3 Lands On Moon's South Pole - Sakshi
Sakshi News home page

Prakash Raj: చంద్రయాన్-3 సక్సెస్.. ప్రకాశ్‌ రాజ్‌పై దారుణంగా ట్రోల్స్!

Aug 23 2023 8:07 PM | Updated on Aug 23 2023 8:49 PM

Netizens Trolls On Actor Prakash Raj About Chandrayan3 Success - Sakshi

యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషలు కృషి చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఆగస్టు 23, 2023 భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా లిఖించబడింది. ఇంతటి ఘనత సాధించిన మన శాస్త్రవేత్తలను ఘనతను ప్రపంచ మొత్తం అభినందిస్తోంది. ఈ విజయం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(ఇది చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ )

అయితే ఇంతకుముందు విక్రమ్ ల్యాండర్‌ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతినేలా ఇస్రో ఛైర్మన్ ఛాయ్ పోస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అంతే కాకుండా ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. 

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫోటో ఇదేనంటూ.. అతను బురదలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లోని ప్రకాశ్ రాజ్ క్లిప్స్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. చంద్రయాన్-3 నుంచి రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి చిత్రం ఇదేనంటూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇస్రో విజయం పట్ల కంగ్రాట్స్ చెబుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి: కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement