మోడ్రన్ మాస్టర్స్‌ | Netflix Unveils Trailer for Modern Masters: SS Rajamouli Capturing the Journey of a Visionary Filmmaker | Sakshi
Sakshi News home page

మోడ్రన్ మాస్టర్స్‌

Jul 23 2024 12:22 AM | Updated on Jul 23 2024 12:22 AM

Netflix Unveils Trailer for Modern Masters: SS Rajamouli Capturing the Journey of a Visionary Filmmaker

‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమకి తొలి ఆస్కార్‌(ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ) అవార్డు తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. అలాంటి ప్రతిభావంతుడైన రాజమౌళి  జీవిత విశేషాలతో ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌. ఇందులో రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు. 

ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కరణ్‌ జోహార్, జేమ్స్‌ కామెరూన్ , కీరవాణి, రమా రాజమౌళి వంటి వారు రాజమౌళిపై తమ అభిప్రాయాలతో పాటు పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.

‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన వస్తోందంటే రాజమౌళి లైఫ్‌ స్టోరీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement