దీపికను విచారించిన అధికారికి కోవిడ్‌

NCB Deputy Director Who Investigated Deepika Padukone Tested covid19 - Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పుత్‌ మరణంతో సంబంధముందని భావిస్తున్న బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి గత నెలలో దీపికా పదుకొనెను విచారించిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఎన్సీబీ ఇప్పటికే దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌లను విచారించింది. వీరంతా డ్రగ్స్‌ వాడకాన్ని వ్యతిరేకించామని చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ కేసుకు సంబంధించి మరికొందరిని విచారించాల్సి ఉండటంతో, వీరిని తిరిగి విచారణకు పిలిచే అవకాశాలుు ఉన్నాయని అధికారులు చెప్పారు. (మరిన్ని కోడ్ వర్డ్‌లు బయటపెట్టిన దీపికా!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top