NBK107: Balakrishna, Gopichand Malineni Movie Shooting in Kurnool, Pic Viral - Sakshi
Sakshi News home page

NBK107-Balakrishna: కర్నూల్‌ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!

Jul 25 2022 11:01 AM | Updated on Jul 25 2022 11:56 AM

NBK107: Nandamuri Balakrishna, Gopichand Malineni Movie Shooting in Kurnool - Sakshi

అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీ ఎన్‌బీకే107(NBK107) అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

‘‘నేటి నుంచి అక్కడి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్‌ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్‌గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement