Nayanthara's Horror-Thriller 'Connect' Releasing on 22nd December - Sakshi
Sakshi News home page

Nayanthara:  నయనతార హారర్ థ్రిల్లర్ మూవీ 'కనెక్ట్'.. రిలీజ్ ఎప్పుడంటే?

Dec 5 2022 2:30 PM | Updated on Dec 5 2022 2:54 PM

Nayanthara horror thriller Movie Connect releasing on 22nd of December - Sakshi

నయనతార కథానాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'కనెక్ట్'. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించగా.. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. 

హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ ఓ స్పెషలిస్ట్. నయనతార కథానాయికగా ఆయన తెరకెక్కించిన 'మయూరి' సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది.  అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన 'గేమ్ ఓవర్' కూడా సూపర్ హిట్టయింది. 'కనెక్ట్' చిత్రాన్ని కూడా అదే తరహాలో ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న టాలీవుడ్‌లో విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్  సంగీతమందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement