ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్‌ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్‌ రిలీజ్‌ | Nayanthara Horror Thriller Connect Movie Trailer Is Out Now | Sakshi
Sakshi News home page

Nayanthara : ఇంటర్వెల్‌ లేని నయన్‌ కనెక్ట్‌ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్‌ రిలీజ్‌

Published Fri, Dec 9 2022 11:04 AM | Last Updated on Fri, Dec 9 2022 11:15 AM

Nayanthara Horror Thriller Connect Movie Trailer Is Out Now - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన మరో హారర్‌ చిత్రం కనెక్ట్‌. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్‌ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

కరోనా లాక్‌డౌన్‌ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్‌ ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

99 నిమిషాల నిడివితో ప్ర‌యోగాత్మ‌కంగా ఇంట‌ర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement