
చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లోకి నయనతార ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు తాజాగా చిత్రయూనిట్ ఒక వీడియోను షేర్ చేస్తూ స్వాగతం పలికింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Mega157లో నయనతార నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిని ధృవీకరిస్తూ నయనతారతో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి విడుదల చేశారు. జూన్‌లో ప్రారంభం కానున్న షూటింగ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ చిత్రంతో చాలారోజుల తర్వాత నయనతర హీరోయిన్‌గా తెలుగులో మళ్లీ అడుగుపెడుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది