భార్యకు వేధింపులు.. ఇంటికి రాకుండా హోటల్‌లోనే నటుడు! | Nawazuddin Siddiqui Moves Into a Hotel amid Alia Allegations | Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: భార్యకు ఇంట్లో తిండి పెట్టకుండా వేధింపులు.. హోటల్‌లోనే సెటిలైన నటుడు!

Feb 5 2023 6:18 PM | Updated on Feb 5 2023 6:35 PM

Nawazuddin Siddiqui Moves Into a Hotel amid Alia Allegations - Sakshi

సరిగా తిండి పెట్టకుండా, వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకుండా వేధిస్తున్నారని, తను ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారంటూ

బాలీవుడ్‌ జంట నవాజుద్దీన్‌ సిద్దిఖి- ఆలియా ఇంటి రచ్చ రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే! కొంతకాలంగా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్న ఆలియా పాస్‌పోర్టు సమస్యలతో దుబాయ్‌ వెళ్లలేక నవాజుద్దీన్‌ ఇంటికి తిరిగొచ్చింది. కానీ తనకు ఇంట్లో ఉండే అర్హత లేదంటూ అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు విడాకులు మంజూరు కాలేదని, అలాంటప్పుడు ఇంట్లో ఉండే అర్హత తనకెందుకు లేదని తిరిగి ప్రశ్నించింది ఆలియా. అంతేకాకుండా సిద్దిఖి తల్లి తనను వేధింపులకు గురి చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తర్వాత ఆలియాను ఇంట్లోకి రానిచ్చినప్పటికీ సరిగా తిండి పెట్టకుండా, వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకుండా వేధిస్తున్నారని, తను ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారంటూ ఆమె తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో సిద్దిఖి కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేదాకా అతడు హోటల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సిద్దిఖి స్నేహితుడు వెల్లడించాడు.

చదవండి: హీరోయిన్‌ ఇంట మోగిన పెళ్లి బాజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement