
చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను.

9 రోజులు తిండి లేకుండా..
తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను.
సినిమా
ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్ ఫక్రి.. రాక్‌స్టార్ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్‌ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్‌ఫుల్ 5 సినిమాతో అలరించింది.