‘సిద్దార్థ్‌ నేరస్థుడు.. అతడిపై కోర్టులో కేసు నడుస్తోంది’

Narayanan Thirupathy Reacts On Sidharth Allegations On BJP - Sakshi

తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని హీరో సిద్దార్థ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పాడు. అయితే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సిద్దార్థ్‌ మరో ట్వీట్‌ చేస్తూ తనకు, తన కుటుంబం భద్రత దృష్ట్యా పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ స్పోక్స్‌పర్సన్‌ నారాయణన్‌ తిరుపతి కూడా దీనిపై స్పందించారు. సిద్దార్థ్‌ ప్రధాని మోదీని అగౌరపరిచి మరోసారి నేరస్థుడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిద్ధార్థ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. గతంలో నేను అతడిపై  కేసు పెట్టాను. అది ఇప్పటికీ కోర్టులోనే ఉంది. తాజాగా అతడు ప్రధాన మంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి మరోసారి అపరాది అయ్యాడు. ఇటీవల సిద్దార్థ్‌ చేసిన ట్వీట్‌లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై  వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న బెదిరింపుల్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. ఒకవేళ అతనికి సమస్య ఉంటే చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత తీసుకురావడం సరైనది కాదు. ఇది ఖండించదగిన చర్య’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

అలాగే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ వింగ్‌ హెడ్‌ సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌ సిద్దార్థ్‌ ఆరోపణలను  ఖండించారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘సిద్దార్థ్‌కు వస్తున్న బెదిరింపులకు బీజేపీకి ఎలాంటి సబంధం లేదు. సిద్దార్థ్‌ వంటి వ్యక్తులపై దృష్టి పెట్టొద్దని పార్టీ సభ్యులు, అనుచరులను అభ్యర్థిస్తున్న’ అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ తన మొబైల్‌ నంబర్‌ లీక్‌ చేసిందని,  గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చినట్లు సిద్దార్థ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని, ఆ నంబర్లంన్నింటిని రికార్డ్‌ చేశాను.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్‌ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని తెలిపాడు. అంతేగాక వీట్నింటిని పోలీసులుకు అందించానని కూడా సిద్దార్థ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

చదవండి: 
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్‌
పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top