‘నాన్నంటే' .. పిల్లలకు మంచి సందేశం ఇచ్చే చిత్రం

Nannante Movie Trailer Out - Sakshi

‘నాన్నంటే’ చిత్రం పోస్టర్, ట్రైలర్ లాంచ్

వై ఎస్ కె, నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన చిత్రం 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై అశోక్‌ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు.

కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... నాన్న గొప్పదనాన్ని ఈ చిత్రం మరింత  గొప్పగా చెప్పిందని, పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తుందని అన్నారు. శివ సాంగ్ చాలా బాగుందన్నారు.ర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ... నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. కోట శంకర్ రావు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ తనకు మంచి పాత్ర ఇచ్చారని, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top