టైటిల్‌కి తగ్గట్టే ‘అద్భుతం’ గా శివాని, తేజ సజ్జల ఫస్ట్‌ లుక్‌ | Nani Unveils Title And First Look Poster Of Shivani And Teja Sajja Movie | Sakshi
Sakshi News home page

టైటిల్‌కి తగ్గట్టే ‘అద్భుతం’ గా శివాని, తేజ సజ్జల ఫస్ట్‌ లుక్‌

Jul 2 2021 10:20 AM | Updated on Jul 2 2021 10:29 AM

Nani Unveils Title And First Look Poster Of Shivani And Teja Sajja Movie - Sakshi

హీరో రాజశేఖర్, నటి జీవితల కుమార్తె శివాని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’.  తేజ సజ్జ హీరో. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చంద్రశేఖర్‌ మొగుళ్ల నిర్మిస్తున్నారు. గురువారం (జూలై 1న) శివాని పుట్టినరోజు సందర్భంగా ‘అద్భుతం’ మూవీ ఫస్ట్‌ లుక్‌ని హీరో నాని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘అ, కల్కి, జాంబిరెడ్డి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.‘‘అద్భుతం’ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్‌ లుక్‌ని వినూత్నంగా సిద్ధం చేశారు మల్లిక్‌ రామ్‌’’ అన్నారు చంద్రశేఖర్‌ మొగుళ్ల. ఈ చిత్రానికి సహనిర్మాత: సృజన్‌ యార్లభోలు, సంగీతం: రాదన్, కెమెరా: చింతా విద్యాసాగర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement